నేను అట్టాంటి ఇట్టాంటి దాన్ని కాదు మావో

నేను అట్టాంటి ఇట్టాంటి దాన్ని కాదు మావో

యంగ్ సెన్సేషన్ ‘కిరణ్ అబ్బవరం’ హీరోగా నటిస్తున్న ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ నుంచి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘నేను అట్టాంటి ఇట్టాంటి దాన్ని కాదు మావో.. నీకు చెమటలు పట్టించుకోని పోను మామో.. నేను అట్టాంటిట్టాంటి దాన్ని కాదు మావో..నీ కండలు కరిగించి కానీ పోను మామో’.. అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పాటలో బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాలోని 'చిలకపచ్చ కోక', అలాగే అన్నయ్య సినిమాలోని 'ఆట కావాలా పాట కావాలా' పాటలకు కిరణ్ అబ్బవరం డ్యాన్స్ చేసి మెప్పించారు. S R కళ్యాణ మండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజా వారి రాణి గారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం, సమ్మతమే లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. ఇందులో కమర్షియల్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందింది. సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో తెరకెక్కింది. సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు. 

న‌టీన‌టులు - కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని, భరత్ రొంగలి త‌దిత‌రులు

టెక్నికల్ టీమ్ : స‌మ‌ర్ప‌ణ‌.. కోడి రామ‌కృష్ణ‌ బ్యాన‌ర్‌.. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ లిరిక్స్‌.. భాస్క‌ర్ భ‌ట్ల. ఎడిట‌ర్‌.. ప్ర‌వీన్ పూడి. ఆర్ట్ డైర‌క్ట‌ర్‌.. ఉపేంద్ర రెడ్డి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ భ‌ర‌త్ రొంగలి. పీఆర్వో ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌. డిజిటల్ ప్రమోషన్స్.. వినీత్ సందీప్. సినిమాటోగ్ర‌ఫి.. రాజ్ కే నల్లి
సంగీతం మ‌ణిశ‌ర్మ‌. కో-ప్రోడ్యూస‌ర్‌ న‌రేష్ రెడ్ది మూలే. ప్రోడ్యూస‌ర్‌ కోడి దివ్య దీప్తి
డైర‌క్ట‌ర్‌ శ్రీధర్ గాదె.