కొత్త బార్ అండ్ రెస్టారెంట్లకు నోటిఫికేషన్ : జూన్ 6వ వరకే గడువు

కొత్త బార్ అండ్ రెస్టారెంట్లకు నోటిఫికేషన్ : జూన్ 6వ వరకే గడువు

కొత్త బార్ అండ్​ రెస్టారెంట్లకు తెలంగాణ  ప్రభుత్వం  నోటిఫికేషన్​ జారీ చేసింది. తెలంగాణలో కొత్త బార్ల అండ్​ రెస్టారెంట్లకు జూన్​ 6 వ తేది వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది. కొత్తగా 28  కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

తెలంగాణలో కొత్తగా బార్​ అండ్​ రెస్టారెంట్లకు దరఖాస్తు చేసుకొనేందుకు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.  28 బార్​ అండ్​ రెస్టారెంట్లకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.  ఒక్కో అప్లికేషన్​కు ఫీజు  రూ. లక్ష రూపాయిలు చెల్లించాలని...  ఈ ఫీజు తిరిగి ఇవ్వబడదని  తెలిపింది. 

ఈ మధ్యనే తెలంగాణ రూరల్ ప్రాంతంలో  25 కొత్త బార్లకుఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది.  మూడు నెలల కాలంలో  53 కొత్త బార్ లకు తెలంగాణ ఎక్సైజ్​ శాఖ అనుమతి ఇచ్చింది.  ఈ అప్లికేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 14 కోట్ల రూపాయిల ఆదాయం వచ్చింది.  ఇప్పుడు మరో 28 బార్​ అండ్​ రెస్టారెంట్​ దరఖాస్తులకు  కూడా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది.  తెలంగాణలో మొత్తం 1176 బార్లు ఉండగా.. ఇక బార్​ అండ్​ రెస్టారెంట్లు కొత్త వాటితో కలుపుకొని 1129 ఉన్నాయని ఎక్సైజ్​ అధికారులు తెలిపారు.