కుర్తాలంటే అమ్మాయిలకు ఇంట్రెస్ట్

కుర్తాలంటే అమ్మాయిలకు ఇంట్రెస్ట్

కొత్త డ్రెస్సింగ్ స్టైల్స్ ఎన్ని వచ్చినా కుర్తాలను  బీట్ చేయలేవు. అమ్మాయిలకు కుర్తాలపై ఉండే ఇంట్రెస్ట్ అలాంటిది మరి. ట్రెండ్‌‌కు తగ్గట్టు కుర్తాల్లో రకరకాల డిజైన్లు వచ్చాయి.  పొడవాటి ట్రెడిషనల్ కుర్తాలు బోర్‌‌ కొడితే.. ఇండో వెస్టర్న్ లుక్‌‌లో ఉండే కఫ్తాన్ కుర్తాలు ఎంచుకోవచ్చు.

కొద్దిపాటి కుచ్చులతో ఇవి మోడర్న్‌‌గా కనిపిస్తాయి. ఇందులో ప్రింటెడ్‌‌, ఎంబ్రాయిడరీ, సాలిడ్.. ఇలా చాలారకాలున్నాయి. ఈ కుర్తాలపై లెగ్గింగ్స్ లేదా జీన్స్‌‌ వేసుకోవచ్చు. బయటకు వెళ్లేటప్పుడు లేదా ఫంక్షన్లలో వేసుకునేందుకు ఇవి బాగుంటాయి. కుర్తాల్లో మోడర్న్‌‌ టచ్‌‌ కావాలనుకునే వారికి ఇవి సూపర్‌‌‌‌గా సెట్ అవుతాయి.