EPFO కొత్త ఫీచర్.. ఉద్యోగులకు బెస్ట్ ఆప్షన్

EPFO కొత్త ఫీచర్.. ఉద్యోగులకు బెస్ట్ ఆప్షన్

ఉద్యోగుల కోసం EPFO సంస్థ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. పాతసంస్థలో జాబ్ మానేసిన డేట్ ను ఆన్ లైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని ఉద్యోగులకే కల్పించింది. పాత కంపెనీలో జాబ్ మానేసి కనీసం రెండు నెలలైతేనే ఇలా నమోదు చేసుకోవడానికి వీలుంది. EPFO నిర్ణయంతో ఉద్యోగులకు ఎంతో ఉపశమనం దొరకనుంది. గతంలో కంపెనీ మారేటపుడు పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలంటే ఎంతో ఇబ్బందయ్యేది. మనం ఉద్యోగం మానేసిన తేదీని మాజీసంస్థ EPF వెబ్ సైట్ లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు కంపెనీలకే మాత్రమే తేదీని నమోదు చేసే అవకాశం ఉండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.