టెక్నాలజీ : వాట్సాప్ లేకుండా లొకేషన్ షేర్​

టెక్నాలజీ : వాట్సాప్ లేకుండా లొకేషన్ షేర్​

తెలియని ప్రాంతాలకు మొదటిసారి వెళ్తుంటే లొకేషన్ షేర్ చేయమని’ అక్కడున్న వాళ్లని అడగడం సహజం. వాట్సాప్​ లేదా వేరే లొకేషన్ షేరింగ్​ యాప్​ల నుంచి లొకేషన్​ పంపిస్తారు అవతలి వాళ్లు. అయితే, ఇప్పుడు అవి కూడా అవసరం లేదు. గూగుల్ ఉంటే చాలు వెళ్లాల్సిన రూట్​, షార్ట్​ కట్​లతో సహా చెప్పే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. రూట్ మ్యాప్​పై రియల్ టైం లొకేషన్ షేరింగ్​ వాడాలంటే వాట్సాప్​కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు. గూగుల్ మ్యాప్స్​ యాప్ ఉంటే చాలు. 

  •     యాప్​​లో లాగిన్​ అయ్యి, ప్రొఫైల్​ లింక్​ అకౌంట్​పై క్లిక్ చేయాలి. 
  •     అందులో లొకేషన్ షేరింగ్ ఆప్షన్ సెలక్ట్​ చేయాలి. 
  •     స్క్రీన్​పై కనిపిస్తున్న న్యూ షేర్​ పై క్లిక్ చేసి టైం సెట్​ చేయొచ్చు. 
  •     లేదంటే ‘అంటిల్​ యు టర్న్​ దిస్ ఆఫ్​’ ఆప్షన్ సెలక్ట్ చేసి కాంటాక్ట్​ ఎంచుకుని ఎస్సెమ్మెస్​ మెసేజ్ పంపాలి.