శాకుంతలం నుంచి మరో పోస్టర్ రిలీజ్

శాకుంతలం నుంచి మరో పోస్టర్ రిలీజ్

ఏమాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత. వరుస సినిమాలతో కుర్రకారుని  మాయ చేసింది. ఈ రోజు 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సామ్కు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె నటిస్తున్న శాకుంతలం టీమ్ నుంచి బర్త్ డే సర్ ప్రైజ్ గా ఓ పోస్టర్ రిలీజైంది. ప్రస్తుతంత ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్ అండ్ వైట్ డ్రైస్ లో శకుంతల పాత్రలో సమంత మరింత అందంగా కనిపిస్తోంది. 


గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెత్తుకున్న శాకుంతలం సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. పౌరణిక నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను చూపించనున్నారు. ఈ ప్రేమకావ్యంలో సమంతకు జోడిగా దుష్యంతుడి పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ సినిమాతోనే బాలనటిగా తెరంగేట్రం చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న శాకుంతలం మూవీని గుణ శేఖర్ సొంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.