200 ఏండ్లు ఉండేలా కొత్త సెక్రటేరియెట్

200 ఏండ్లు ఉండేలా కొత్త సెక్రటేరియెట్
  • స్పీడ్​గా సెక్రటేరియట్ పనులు
  • ఒక్కో బేస్ మెంట్​కు 115 టన్నుల స్టీల్, 8 వేల బస్తాల సిమెంట్, 780 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్
  • పనులు చెక్ చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

కొత్త సెక్రటేరియట్ 200 ఏండ్లు పటిష్టంగా ఉండేలా, భూకంపాలను సైతం తట్టుకునేలా క్వాలిటీగా పనులు చేస్తున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. గురువారం సెక్రటేరియెట్ నిర్మాణ పనులను అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్ 200 ఏండ్లు పటిష్టంగా ఉండేలా, భూకంపాలు సైతం తట్టుకునేలా క్వాలిటీగా పనులు చేస్తున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఐఐటీ ఎక్స్ పర్ట్స్ సూచనలు, స్ట్రక్చర్ ఇంజనీర్ల పర్యవేక్షణలో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గురువారం సెక్రటేరియెట్ నిర్మాణ పనులను అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీ అధికారులతో కలిసి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వర్క్ చార్ట్ ప్రకారం జరుగుతున్నాయో లేదో చెక్​ చేశారు. వర్క్ సైట్ లో అన్ని విభాగాల నుంచి బ్లాక్ ల వారిగా సంబంధిత సిబ్బంది ఉన్నారో లేదో తనిఖీ చేశారు. బీ4 ర్యాఫ్ట్ ఫుట్టింగ్ (బేస్ మెంట్)ను పరిశీలించారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..  ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఈ నిర్మాణంలో కీలకమైందన్నారు. ఒక్క ఫుట్టింగ్ లో 115 టన్నుల స్టీల్,780 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అంటే 8 వేల బస్తాల సిమెంట్ వాడినట్లు చెప్పారు. ర్యాఫ్టింగ్ కు వారం రోజులు పడితే కాంక్రీట్24 గంటల్లో పూర్తయిందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మాణం పకడ్బందీగా జరుగుతున్నట్టు చెప్పారు. ఆయన వెంట ఈఎన్సీ గణపతి రెడ్డి,  సత్యనారాయణ, శశిధర్ తదితరులు ఉన్నారు.