
- ప్రారంభించిన నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్
పద్మారావునగర్, వెలుగు: బోయిన్ పల్లి పీఎస్పరిధిలో అత్యంత నూతన టెక్నాలజీతో రూపొందించిన 123 సీసీ కెమెరాలను నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ బుధవారం ప్రారంభించారు. 11 కిలో మీటర్లలో ప్రతి రోడ్డును కవర్ చేస్తూ పీఎస్ లోని కమాండ్కంట్రోల్రూమ్కు వీటిని అనుసంధానించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బంజారాహిల్స్ కు చెందిన జెమిని ఎడిబుల్, ప్యాట్స్ ఇండియా కంపెనీ తన సీఎస్ఆర్నిధుల నుంచి రూ.32 లక్షలతో వీటిని అందుబాటులోకి తెచ్చాయన్నారు. లైవ్ లో నంబర్ ప్లేట్ ను డిస్ ప్లే చేయగల సిస్టంతో పలు కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సీసీ కెమెరాలకు నిధులు కేటాయించిన దాతలను డీసీపీ అభినందించారు.