V6 News

ఆలు సాగుకు కొత్త టెక్నాలజీ

ఆలు సాగుకు కొత్త టెక్నాలజీ

హైదరాబాద్​, వెలుగు: ఆలుగడ్డలు సాగుచేసే భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి హైఫార్మ్ సంస్థ, శ్రీ బయో ఈస్థెటిక్స్‌తో ఒప్పందం చేసుకుంది. గుజరాత్,  పంజాబ్ రాష్ట్రాల్లో మైక్రోబయోమ్ విధానం ద్వారా విత్తన నాణ్యత, దిగుబడి పెంచాలని ఎంఓయూ కుదుర్చుకున్నాయి.

 భూమి వ్యాధి నిరోధక శక్తిని పెంచి పంట నష్టాలను తగ్గించడమే ఈ భాగస్వామ్యం ఉద్దేశం. బంగాళదుంప పరిశ్రమలో స్థిరమైన వృద్ధికి ఈ సాంకేతికత దోహదపడుతుందని శ్రీ బయో ఈస్థెటిక్స్ తెలిపింది.