న్యూ ఇయర్ ఎఫెక్ట్.. 10వేల మంది సిబ్బందితో భద్రత కట్టుదిట్టం

న్యూ ఇయర్ ఎఫెక్ట్.. 10వేల మంది సిబ్బందితో భద్రత కట్టుదిట్టం

కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్న తరుణంలో, ఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేస్తున్నారు. దేశ రాజధానిలో నూతన సంవత్సర వేడుకల కోసం సరిహద్దు ప్రాంతాల్లో మోహరింపును పెంచుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తినా, శాంతిభద్రతల పరిరక్షణకు ఢిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

ముఖ్యంగా, ఢిల్లీ సరిహద్దులైన హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ నుండి గణనీయమైన సంఖ్యలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి దేశ రాజధానికి వస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలో గూండాయిజం, ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు 10వేల మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించనున్నట్లు పోలీసులు తెలిపారు. సరిహద్దుల వద్ద పారామిలిటరీ మోహరింపుతో సహా అదనపు పికెట్‌లు, బారికేడ్‌లు, సిబ్బందిని చుట్టుపక్కల రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.

ఢిల్లీ పోలీసు అధికారుల ప్రకారం, వాహనాలు సాఫీగా వెళ్లేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు 2,500 మందికి పైగా సిబ్బందిని మోహరిస్తారు. డ్రంక్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కనీసం 250 బృందాలను నియమించారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరాన్ని ఎంతో ఉత్సాహంగా స్వాగతించాలని తాము కోరుకుంటున్నామని, అయితే ఎవరైనా రోడ్లపై ఇబ్బంది కలిగించినట్లయితే, వారిపై చర్యలు తీసుకుంటామని డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు.

#WATCH | Delhi: Security heightened in the National Capital ahead of the new year. Delhi police conduct checking of vehicles

(Visuals from Barakhamba road) pic.twitter.com/7xMY6T9tuS

— ANI (@ANI) December 31, 2023