ఈ నెలాఖరు వరకు ఉచితంగా ఫాస్టాగ్‌

ఈ నెలాఖరు వరకు ఉచితంగా ఫాస్టాగ్‌

ఎలక్ట్రానిక్‌ టోల్‌ సేకరణను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టింది నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(NHAI). ఇందులో భాగంగా ఈ నెలాఖరు వరకు ఫాస్టాగ్‌లను ఫ్రీగా అందించాలని నిర్ణయించింది.నేషనల్ హైవేలపై జర్నీ చేయాలంటే వాహనానికి ఫాస్టాగ్‌ తప్పనిసరి. ఈ ఏర్పాటు కోసం వసూలు చేస్తున్న రూ. 100 చార్జీని ఈ నెల 15 నుంచి 29 వరకు ఎత్తివేసినట్లు ప్రకటించింది. వినియోగదారులు తమ వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ (RC) ని జాతీయ రహదారి ఫీజు ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్‌ పంపులు వంటి ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ దగ్గర చూపించి ఫాస్టాగ్‌ను తీసుకోవచ్చని తెలిపింది. మైఫాస్టాగ్‌ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకుని దగ్గర్లోని సెంటర్‌ను తెలుసుకోవచ్చు. ఫాస్టాగ్‌ వాలెట్‌లో సెక్యూరిటీ డిపాజిట్, కనీస బ్యాలెన్స్‌ వంటి మిగిలిన అంశాల్లో మార్పుల్లేవని స్పష్టం చేసింది.