తండ్రికి మద్దతుగా నిహారిక ప్రచారం

తండ్రికి మద్దతుగా నిహారిక ప్రచారం

ఎప్పుడు సినిమాలు, యూట్యూబ్ సిరీస్ లతో బిజీగా ఉండే కొణిదెల నిహారిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన తండ్రి నాగబాబు జనసేన తరపున పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీగా పోటీచేస్తున్నారు. పవన్ భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. వీరిద్దరి తరపున మంగళవారం నిహారిక ప్రచారం చేశారు. తండ్రికి మద్దతుగా  ప్రచారం చేసిన నిహారిక ఈ ప్రాంతం తమ సొంత ప్రాంతమని.. ఇక్కడి ఓటర్లు తన తండ్రిని గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు.