చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్ - వరుసగా రెండోసారి ప్రపంచ బాక్సింగ్ స్వర్ణం కైవసం

చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్ - వరుసగా రెండోసారి ప్రపంచ బాక్సింగ్ స్వర్ణం కైవసం

ఇండియన్ స్టార్ బాక్సర్‌, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ మరోసారి తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అదిరిపోయే ప్రదర్శనతో గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చాటిన నిఖత్.. ఫైనల్ బౌట్ మొత్తంలో ధైర్యం, దూకుడు, నైపుణ్యం అద్భుతంగా ప్రదర్శించి మువ్వన్నెల జెండాను మరోమారు ప్రపంచ వేదికపై ఎగురవేసింది.

టోర్నమెంట్ మొత్తంలో అజేయంగా సాగిన నిఖత్, తెలంగాణకు, భారత బాక్సింగ్‌కు కొత్త గౌరవాన్ని తెచ్చింది. విజయం అనంతరం దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిఖత్ సాధించిన ఈ గోల్డ్ మెడల్ భారత మహిళా బాక్సింగ్‌లో మరో మైలురాయిగా నిలిచింది.