చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి సత్ప్రవర్తనపై 91 మంది ఖైదీలు విడుదల

చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి సత్ప్రవర్తనపై 91 మంది ఖైదీలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి 91 మంది ఖైదీలు సత్ప్రవర్తనపై విడుదలయ్యారు. వీరిలో 85 మంది పురుషులు, ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు. 2024లోనూ 213 మంది ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగడం వల్ల జైలు జీవితం నుంచి విముక్తి లభించిన సంగతి తెలిసిందే. సోమవారం.. జూన్ 2, 2026న డీజీ సౌమ్య మిశ్రా.. 92 మంది ఖైదీల విడుదలపై ఉత్తర్వులు జారీ చేశారు.

అర్హులైన ఖైదీలకు స్వేచ్ఛ దక్కింది. పునరావాసమే లక్ష్యంగా జైళ్ల శాఖ చర్యలు తీసుకుంది. సత్ప్రవర్తనతో ఖైదీలు సమాజంలోకి తిరిగి అడుగుపెట్టనున్నారు. సమాజంలో సత్ర్పవర్తనతో మెలిగేందుకు తెలంగాణ ప్రభుత్వం ఖైదీలకు మరో అవకాశం కల్పించింది. మంచి ప్రవర్తనకు గుర్తింపుగా 92 మంది ఖైదీలు చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి విడుదల కావడం విశేషం.

ఖైదీల విడుదలపై  జైళ్ళ శాఖ డీజీ సౌమ్య మిశ్రా స్పందన:
* తెలంగాణ ప్రభుత్వ సహకారంతో 91 మందిని విడుదల చేస్తున్నాం
* ఇందులో 85 మంది మగవారు, ఆరుగురు ఆడవాళ్లు ఉన్నారు 
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జైళ్ల శాఖ తరపున ధన్యవాదాలు
* ఒకే ప్రభుత్వంలో రెండుసార్లు జైలు నుంచి ఖైదీలను సత్ప్రవర్తన మీద విడుదల చేయడం చాలా అరుదు
* ఇప్పుడున్న ప్రభుత్వంలో ఖైదీలను విడుదల చేయటం ఇది రెండవసారి 
* ఇంతకుముందు సుమారుగా 230 మందిని విడుదల చేసాం 
* సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సంవత్సరానికి మూడుసార్లు ఖైదీలను విడుదల చేసే అవకాశం ఉంది
* ఖైదీలు ఈ అవకాశం ఉపయోగించుకోవాలి
* ఈరోజు విడుదల అవుతున్న ఖైదీలు.. వారు ఏ ఉపాధిని ఎంచుకుంటారో తెలుసుకున్నాం
* కొంతమందికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నం
* మరికొందరికి ఇతర ఉపాధి కల్పిస్తున్నాం 
* ఈరోజు విడుదల అవుతున్నవారు... జీవితంలో కొత్త చాప్టర్ని ప్రారంభిస్తున్నారు
* మళ్ళీ పోలీస్ స్టేషన్స్, జైళ్ళ చుట్టూ తిరిగే పనులు చేయకూడదు
* విడుదలైన ఖైదీలు ఇంటికి వెళ్లడానికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోంది 
* మీరు బయటికి వెళ్లి మంచిగా బతికితేనే మేము చేసిన కృషికి ఫలితం దక్కుతుంది
* మీరు బయటికి వెళ్లిన తర్వాత మళ్లీ ఎలాంటి తప్పుడు పని చేయాలనే ఆలోచన రానివ్వదు

►ALSO READ | పవన్ కళ్యాణ్‎ ఏపీ వ్యక్తి.. తెలంగాణపై ప్రేమ ఉండదు: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్