రిటైల్ ప్రి-ప్యాక్ లపై జీఎస్టీ

రిటైల్ ప్రి-ప్యాక్ లపై జీఎస్టీ
  • రిటైల్ ప్రి-ప్యాక్ లపై జీఎస్టీ
  • కేసినోలపై జీఎస్టీ విధింపుపై నిర్ణయం వాయిదా


న్యూఢిల్లీ: రాష్ట్రాలకు పరిహార సెస్​ చెల్లింపును కొనసాగించాలన్న ప్రపోజల్​పై చండీగఢ్​లో బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో​ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. కేసినోలు, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న గ్రూప్​ ఆఫ్​ మినిస్టర్స్ (జీఎంఓ) ప్రపోజల్స్​పై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ అంశాలపై జులై 15 వరకు తన జీఎంఓ తాజా రిపోర్టును ఇస్తుంది. బ్రాండెడ్ కాని కొన్ని ఆహార పదార్థాలు,  ధాన్యాలు మొదలైన వాటిపై ఇక నుంచి జీఎస్టీని మినహాయిస్తారు. పెరుగు, లస్సీ, వెన్న, పాలతో ప్రీ-ప్యాక్​ చేసిన, ప్రి- లేబుల్ చేసిన ప్యాక్​లపై పన్ను విధిస్తారు. కొత్త రేట్లు జులై 18 నుంచి అమల్లోకి వస్తాయి. చెక్కుల జారీకి ( పుస్తక రూపంలో) బ్యాంకులు వసూలు చేసే చార్జీలపై ​​18 శాతం జీఎస్టీ విధిస్తారు. ఇక నుంచి రూ.వెయ్యిలోపు అద్దె ఉండే హోటల్ గదులపై 12 శాతం జీఎస్టీ వేస్తారు.  ఒక రోగి ఆసుపత్రి గదికి (ఐసీయూ మినహా) రోజుకు రూ. 5,000 కంటే ఎక్కువ చెల్లిస్తే 5 శాతం పన్ను పడుతుంది. అట్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వాల్ మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, టోపోగ్రాఫికల్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  గ్లోబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో సహా అన్ని రకాల మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు హైడ్రోగ్రాఫిక్  చార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై 12 శాతం జీఎస్టీ ఉంటుంది.