ప్రభాస్ అంటే చాలా ఇష్టం..యాక్ట్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా

ప్రభాస్ అంటే చాలా ఇష్టం..యాక్ట్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా

అవకాశాలు అరుదుగా వస్తాయి. అప్పుడే మనమేంటో ప్రపంచానికి నిరూపించు కోవాలి. విమర్శలనే ప్రశంసలుగా మలుచుకోవాలంటోంది మిస్ ఇండియా ఇంటర్నేషనల్​  ఫైనలిస్ట్ అనీషా తాళంపల్లి. నవంబర్ 14 న ఇండోనేసియాలో జరగనున్న మిస్ ఇండియా పోటీకి తెలంగాణ, కర్నాటక రాష్ట్రా ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కర్నాటక మోడల్ ఏమంటోందంటే… 

కలలు అందరూ కంటారు . కానీ కొందరు మాత్రమే కన్న కలల్ని నిజం చేసుకుని సక్సెస్ కి చిరునామాగా నిలుస్తా రు. ఆ కోవకు చెందిందేకర్నాటకలోని ఒక మారుమూల గ్రామానికి చెంది న అనీషా తాళంపల్లి. 

 ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, తాను అనుకున్న లక్ష్యం కోసం నిలబడి మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2019 టాప్ 30లోచోటు సంపాదించింది .మిస్ ఇండియా కిరీటం సాధించడమే నా గోల్ అంటున్న అనీషాతో లైఫ్ చిట్ చాట్.

నాకు ఆరేళ్లుంటాయిఅనుకుంటా అప్పుడు. టీవీ ఆన్ చేస్తే రెడ్ గౌన్ లో ప్రియాంక చోప్రా స్టేజ్ పై మెరుపుతీగలా నడుస్తూ కంటపడింది  ఆమెను చూసి చుట్టూ ఉన్నవాళ్లం తాకుర్చీల్ల ోంచి లేచి చప్పట్లు కొడుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. నాన్నని అడిగితే ‘‘ఆమె టాప్ మోడల్ అందుకే ఆమె నడుస్తుంటే చప్పట్ల వర్షం కురుస్తుంద’’ని చెప్పారు. ఆ క్షణమే ఫిక్స్ అయ్యా మోడల్ అవ్వాలని. అందరితో చప్పట్లు కొట్టిం చుకోవాలని. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఆ చప్పట్ల మోతలే నన్ను మోడలిం గ్ వైపు అడుగులేయించాయి.అప్పట్నుంచి ఫ్యాషన్ షోలు ఫాలో అవ్వడం మొదలుపెట్టా. టీవీలో మోడల్ కనిపిస్తే చాలు టీవీకే అతుక్కుపోయేదాన్ని. మోడల్స్ ని చూస్తూ వాళ్లలా పోజులిచ్చే దాన్ని. అవన్నీ చూసి ఇంట్లో వాళ్లు చిన్నపిల్ల ఏదో సరదాగా చేస్తుందిలే అనుకునేవాళ్లట. కానీ పెరిగి పెద్దవుతున్నా కొద్దీ మోడలింగ్ పై ఆసక్తి ఎక్కువ అవుతుండటంతో నాన్న నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.ఈ రంగం మీద కలలు కనడం అంత మంచిది కాదని చెప్పారు. కానీ వాటిని ఏం పట్టిం చుకోలేదు. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక్క అవకాశం కోసం ఎదురుచూపులు మొదలుపెట్టా. మోడలింగ్ పై నాకున్న ఇష్టాన్ని చూసి అమ్మానాన్నలు కూడా ప్రోత్సహించారు. దాంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రయాణంఅంత తేలిక కాదని తెలిసినా, ఆ చప్పట్ల మోతని

అంత తేలికగా చేరుకోలేమని అర్థమైనా నాప్రయత్నాలను విరమించలేదు. నా కల దిశగా అడుగులేసి ఈ రోజు మిస్ ఇండియా టాప్ 30లో ఒకదానిగా నిలిచా.

నాన్న వల్లే సాధ్యమైంది 

కర్ణా టక రాష్ ట్రంలోని దుంసునూర్ గ్రామం మాది. అంత మారుమూల ప్రాంతం నుంచి మిస్ ఇండియా ఫైనల్ స్టేజికి చేరుకున్నా నంటే అంతా నాన్నవల్లే. . నాన్న తాళంపల్లి శ్రీనివాస్ రైతు. ఉదయం సూర్యుడి కన్నా ముందే పొలంలో అడుగుపెట్టి, రాత్రి చంద్రుడ్ని పలకరించాకే ఇంటి కి వస్తారు. వ్యవసాయం మీద మిగిలిందంతా నన్ను, ఇద్దరు తమ్ము ళ్లని చదివించడానికి అయిపోయేది. వీటన్నింటి కి తోడు నా ‘కలల’ భారం. ఆయన చెప్పేవాళ్లు కాదు కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎంత కష్టమైనా మా వరకు రానిచ్చే వాళ్లు కాదు.నవ్వుతూ నీకు నచ్చింది చెయ్యమంటూ ప్రోత్సహించేవాళ్లు. నేను ఏది అడిగినా కాదనే వారు కాదు. అయితే చదువు అయ్యాకే మోడలింగ్ అని కండీషన్ మాత్రం పెట్టారు.

స్టడీస్ ఫస్ట్

నాన్నని నొప్పించడం ఇష్టం లేక మొదట చదువు మీద దృష్టి పెట్టా. ఏవియేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశా. ఆ తర్వాత నా కలని నిజం చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చా . మోడల్ అవ్వాలనే లక్ష్యం ఉందే తప్ప అసలు ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలో అర్థం కాలేదు. సిటీలో తెలిసిన వాళ్లు కూడా ఎవరూ లేరు. తెచ్చుకున్న డబ్బుకూడా హాస్టల్ ఫీజుకే అయిపోయింది. దాంతో ఉద్యోగం వేటలో పడ్డా , ఏవియేషన్ లో ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు.చేసేదేం లేక హాస్పిటల్ లో 13 వేల జీతానికి రెండేళ్లు పనిచేశా. హాస్టల్ ఫీజు, ఖర్చు లు పోను60 వేలు మిగిలాయ్ . వాటితో పోర్ట్​ఫొలియో చేయించుకుని మోడలింగ్ అవకాశాల వేటలో పడ్డా . ఆ సమయంలోనే మిస్ ఇండియా ఇంటర్నేషనల్2019 ఆడిషన్స్ కి ఫొటోలు పంపించా. 2017, 2018 లో కూడా ఈ  కాంటెస్ట్​కి అప్లికేషన్ పంపా. కానీ, రెం డుసార్లు నిరాశే ఎదురయ్యింది. మూడోసారి ముచ్చటగాఅవకాశం వరించింది.

లైట్ గా తింటా

నేను జంక్‌‌ ఫుడ్‌‌ తినను. వీలైనంత వరకూ హోమ్‌ ఫుడ్‌‌ మాత్రమే తిం టా. జిమ్​ చేస్తా. డైలీ ఒక గంట యోగ చేస్తా. బీట్ రూట్ జ్యూస్ , వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతా. మంచి నిద్ర కూడా ఫిట్‌‌నెస్‌‌కు మేలు చేస్తుంది అందుకే బాగా నిద్రపోతా. మోడల్ అంటే ‘జీరోసైజ్ ఫిజిక్ పక్కా ’ అనుకుంటారు చాలామంది, కానీ నేను అది నమ్మను. మీ శరీరా కృతిపై మీ కంట్రోల్‌‌ ఉంటే చాలు. మరీ చబ్బీ గా కాకుండా హెల్దీగా ఉంటే చాలు. మనలోని ప్లస్‌‌లు మైనస్‌‌లు బేరీజు వేసుకుని మన నుండి నెగెటివ్‌ థాట్స్‌‌ తీసేస్తే చాలు.. ఏ పోటీలోనైనా విజయం సాధ్యమే అనేది నా నమ్మకం.

ఈ తర్వాత..

మోడల్ అంటే అనీషా అనిపించుకోవాలనేది నా డ్రీమ్​. అది నెరవేరిన తర్వాత సినిమాల్లోకి వెళ్లే ఆలోచన ఉంది. గ్లామర్‌‌ వరల్డ్‌‌లో ముఖ్యంగా సినీ పరిశ్రమలో రాణించడం అంత తేలిక కాదని తెలుసు. కానీ ఒకవేళ అలాంటి అవకాశమే గనుక వస్తే దాన్ని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుక ుంటా.

వాళ్లం టే ఇష్టం

ప్రపంచసుందరి ప్రియాంక చోప్రా నా ఇన్ స్పిరేషన్ . అలాగే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టం . భవిష్యత్తులో ఆయనతో నటించే అవకాశం వస్తుందేమో చూడాలి. అలాగే కత్రినాకైఫ్ కి వీరాభిమానిని.

నా హాబీస్

నాకు డాన్సిం గ్ అంటే చాలా ఇష్టం . చిన్నప్పట్నుంచి స్కూల్లో, కాలేజీల్లో ఏ కల్చరల్ ఈవెంట్ జరిగినా నా పర్ఫార్మె న్స్ పక్కాగా ఉండేది. నాకు సంతో షమొచ్చినా, బాధొచ్చినా డాన్స్ చేస్తా.

అదొక్కటే చెప్పాలనుకుంటున్నా 

నేను మోడలింగ్ చేయాలనుకున్నప్పుడు మాపేరెంట్స్ తప్ప నా చుట్టూ ఉన్నవాళ్లం తా నిరాశపరిచారు. అయినా సరే నేను నిరుత్సాహపడలేదు. నా మీద నాకున్న నమ్మకంతో ముందుకెళ్లా. ఫైనల్ లో విజయం సాధిస్తానా లేదా అనేది పక్కనపెడితే నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా . సక్సెస్ అయితే ఓకే లేదంటే మళ్లీ ప్రయత్ని స్తా. ఏదో ఒకరోజు రీచ్ అవుతా. అంతేకానీ ప్రయత్నం ఆపను. ఈ రంగంలోకిరావాలనుకునే అమ్మాయిలకు కూడా నేను ఇదే చెప్తా. మిమ్మల్ని మీరు నమ్మండి . మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. ఈ గ్లామర్ వరల్డ్​లో రాణించడమంటే అంత తేలిక కాదు. అవకాశాలు అంత త్వరగా రావు. ఓపికగా వేచిచూడాలి.

మా నాన్నని హ్యాపీగా చూడాలి 

మా నాన్న నా కోసం చేయాల్సి న దానికంటే పదొంతులు ఎక్కువే చేశారు. ప్రతిక్షణం నా వెంటే ఉండి ధైర్యం చెప్పారు. కానీ నేను ఇప్పటి వరకు మా నాన్న కోసం ఏం చేయలేక పోయా. అఫ్ కోర్స్ ఆయన నానుంచి ఏం ఆశించరని తెలుసు. నేను హ్యాపీగా ఉంటే చాలనుకుంటారు. నాన్నే కాదు అమ్మ ఇందుమతి. తమ్ముళ్లు ఇద్దరూ నా కోసం చాలా కలలు కన్నా రు. నేను మోడల్ గా సక్సెస్ అయితే చూడాలనేది వాళ్ల డ్రీమ్​. అది నిజం చేసిన రోజు వాళ్లు నా కోసం పడ్డ కష్టాలన్నింటి కి ప్రతిఫలం దక్కుతుంది.