మూడేళ్ల విరామం తర్వాత టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇవ్వబోతోంది నివేదా పేతురాజ్. బ్రోచేవారెవరురా, చిత్రలహరి, రెడ్ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న ఆమె.. త్వరలో వెంకటేష్ సినిమాలో కనిపించబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మరో కీలకపాత్ర కోసం నివేదా పేతురాజ్‌ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటించిన నివేదా.. మరోసారి ఆయన డైరెక్షన్‌లో నటించబోతోంది. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆమె కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
టైటిల్‌లో కనిపిస్తున్న ‘ఏకే 47’కు తగ్గట్టుగా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. దసరాకు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘దాస్ కా ధమ్కీ’ తర్వాత ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న నివేద.. తిరిగి టాలీవుడ్‌లో బిజీ అవుతుందేమో చూడాలి!
