- కాలేజీలకు ఎన్ఎంసీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్ (ఎండీ/ఎంఎస్) సీట్ల లెక్క తేలింది. 2025~-26 అకడమిక్ ఇయర్ కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని పీజీ సీట్ల తాత్కాలిక జాబితాను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ ను కాలేజీలు సరిచూసుకోవాలని, సీట్ల సంఖ్యలో ఏమైనా తేడాలుంటే 15 రోజుల్లోగా ఆధారాలతో సహా తమకు మెయిల్ కు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.
నిర్ణీత గడువులోగా కాలేజీల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే ఇప్పుడు వెల్లడించిన సీట్లనే ఫైనల్ చేస్తామని, అడ్మిషన్ పోర్టల్ లో అవే అప్డేట్ అవుతాయని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కాలేజీల సీట్ల వివరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
