V6 News

ఎంఎంటీఎస్లో ఫ్రీ జర్నీపై డ్రాఫ్ట్ రాలేదు.. దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్

 ఎంఎంటీఎస్లో ఫ్రీ జర్నీపై డ్రాఫ్ట్ రాలేదు.. దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్
  • సీఎస్​ నోటి మాటగా మాత్రమే అడిగారు
  • దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్​వో శ్రీధర్​

హైదరాబాద్​సిటీ, వెలుగు : ఎంఎంటీఎస్​లో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలతో కూడిన డ్రాఫ్ట్ ఏదీ అందలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. సీపీఆర్​వో శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల రైల్వే జీఎం శ్రీవాత్సవ్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పథకాలపై చర్చించారని, ఇందులో  సీఎస్​రామకృష్ణారావు ఒక ప్రతిపాదన చేశారన్నారు. 

హైదరాబాద్ లో ట్రాఫిక్​ సమస్యల పరిష్కారానికి ఎంఎంటీఎస్​లోనూ ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించాలని కోరారన్నారు. అయితే, దీని పై డిటెయిల్డ్​ప్రపోజల్స్, ఎంవోయూతో కూడిన డ్రాఫ్ట్ పంపాలని జీఎం కోరారన్నారు. కానీ, ఇప్పటివరకు ఏమీ రాలేదన్నారు. ఒకవేళ వస్తే రైల్వే బోర్డు దృష్టికి తీసుకుపోతామన్నారు. జూన్​2 నుంచి ఎంఎంటీఎస్​లో ఉచిత ప్రయాణం అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.