హెల్మెట్ ఉంటేనే పెట్రోల్..జూన్ 1 నుంచే అమలు

హెల్మెట్ ఉంటేనే పెట్రోల్..జూన్ 1 నుంచే అమలు

టూ వీటర్ వాహనదారులకు షాకిచ్చింది గ్రేటర్ నోయిడా జిల్లా యంత్రాంగం. హెల్మెట్‌ లేకుండా  ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ఇకపై పెట్రోల్‌ లభించదంటూ కొత్త రూల్ తీసుకొచ్చింది. నోయిడా, గ్రేటర్ నోయిడాలో పరిధిలోని బైక్‌ రైడర్స్‌ హెల్మెట్‌ లేకుండా పెట్రోల్‌ స్టేషన్‌కు వెళితే అక్కడి సిబ్బంది పెట్రోల్‌ పోయరు. ఈ నిబంధన జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.  దీనికి సంబంధించి కఠిన ఆదేశాలు జారీ చేశారు అధికారులు.

రహదారి భద్రతను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా మేజిస్ట్రేట్ బ్రిజేష్ నారాయణ్ సింగ్ తెలిపారు. దీనిపై ఇటీవల పెట్రోల్‌ పంపుల యజమానులతో సమావేశం నిర్వహించారు.  ప్రస్తుతానికి ఈ అదేశాలను రెండు నగరాల్లో అమలు చేయాలని, తర్వాత  ఇతర ప్రాంతాల్లో  కూడా అమలు చేయాలని యజమానులను ఆదేశించారు.

హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తే, డ్రైవింగ్‌ లైసెన్సును రద్దు చేయడంతో పాటు… 6 నెలలు  జైలు శిక్ష విధించవచ్చు.