శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పరిసరాల్లో ఎలాంటి చిరుత పులి సంచారం లేదని.. కనిపించిన గుర్తులు పులికి సంబంధించినవి కాదని వెల్లడించారు ఫారెస్ట్ అధికారి వీరేశం. ఎయిర్ అథారిటీ నుంచి వచ్చిన సమాచారంతో ఆయా ప్రాంతాలను పరిశీలించటం జరిగిందని.. ఎలాంటి చిరుత తిగిరిన ఆనవాళ్లు లేవని వెల్లడించారాయన. కనిపించిన గుర్తులు టైగర్, చిరుతవి కాదని.. అడవి పిల్లివి మాత్రమే అని సాధారణ అడవి జంతువులకు సంబంధించినవిగా స్పష్టం చేశారాయన.
ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుత సంచారం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ప్రయాణికులు, పరిసర ప్రాంత ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని వివరించారు ఫారెస్ట్ ఉన్నతాధికారి వీరేశం. మరిన్ని తనిఖీల తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి అవసరం ఉంటే పరిశీలిస్తామని.. ఇప్పటి వరకు అలాంటి అవసరం లేదని వివరించారాయన. అడవి పిల్లిని చూసి కొందరు పులిగా భ్రమపడే అవకాశం ఉందన్నారాయన. అది చిరుత పులి కాదని.. అడవి పిల్లికి సంబంధించిన గుర్తులు అని.. భయపడాల్సిన అవసరం లేదని స్థానికులు, విమానాశ్రయ అధికారులకు భరోసా ఇచ్చారాయన.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో.. చుట్టుపక్కల ఎక్కడా చిరుత సంచారం లేదని చెబుతూనే.. భవిష్యత్ లో నిఘా పెడతామని.. అవసరం అయిన చర్యలు తీసుకుంటామని వివరించారాయన. ఇప్పటికి అయితే బోన్లు కూడా ఏర్పాటు చేసే ఆలోచన లేదని.. చిరుత ఆనవాళ్లు కనిపించలేదని.. చిరుత గుర్తులు ఎక్కడా లేవని స్పష్టం చేశారాయన. దీనిపై శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చి వెళ్లే ప్రయాణికులు ఎవరూ భయాందోళనలకు గురి కావొద్దని వివరించారు ఫారెస్ట్ అధికారి.
