- ఓటు ఎక్కడ ఉన్నా స్కీమ్స్ వర్తిస్తాయి
- ఆగస్టు 3 వరకు ‘సర్’ ఫామ్స్ ఇండ్లలో పెట్టుకోవద్దు
- డిజిటలైజ్ చేసేటప్పుడు సర్వర్ల సమస్య వస్తది
- ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓటు హక్కుకు, ప్రభుత్వ స్కీమ్స్‌కు సంబంధం లేదని, ఓటు హక్కు ఎక్కడ ఉన్న స్కీమ్స్ వర్తిస్తాయని, ఆరు నెలలు ఎక్కడ ఉంటే అక్కడ ఓటు హక్కు తీసేకునే అవకాశ ఉంటుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ అన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సర్‌పై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆగస్టు 3 వరకు చివరి తేదీ అని ఫామ్స్ ఇండ్లలో పెట్టుకోవద్దన్నారు. చివరలో ఇస్తే డిజిటలైజేషన్చేసేప్పుడు లోడ్ పడుతుందని, దీనివల్ల సర్వర్లు డౌన్ అవుతాయన్నారు. ఒక్కో ఫామ్ కి 5 నుంచి 10 నిమిషాల టైం పడుతోందని, అందుకే ముందు ఫామ్స్ఇస్తే ఇబ్బందులు ఉండవన్నారు. 3వ తేదీ తర్వాత కూడా ఎక్స్టెన్షన్ఉంటుందని అనుకుంటున్నారని, ఫామ్ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు.
47 శాతం మందికి ఫారాలిచ్చాం
జిల్లాలోని 47.36 లక్షల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని, ఇందులో 42.96 శాతం డిజిటలైజ్ చేసినట్లు కర్ణన్చెప్పారు. జిల్లాలో 9.59 శాతం ఓటర్లు ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ నింపారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ లో నిర్లక్ష్యం వహించిన ఏఈఆర్ వోను సస్పెండ్ చేశామని, కొంతమంది బీఎల్ వో లకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. బీఎల్వోలు ఎలా పని చేస్తున్నారో చెక్ చేయడానికి విజిలెన్స్ ఫీల్డ్ లోకి వెళ్తోందన్నారు. ఇంటింటి సర్వే ఆగస్టు 3వ తేదీ వరకు, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ ఆగస్టు 10న, తుది ఓటరు జాబితా అక్టోబర్ 12న విడుదల కానుందని చెప్పారు. అంతకుముందు ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కర్ణన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతీ పార్టీ తమ బీఎల్‌ఏలకు సూచనలు చేసి, అర్హులైన ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను ఫిల్ చేసి, గడువుకు ముందే ఇచ్చేలా సహకరించాలని కోరారు.
