3 నెలలుగా జీతాలు పెండింగ్

3 నెలలుగా జీతాలు పెండింగ్

హైదరాబాద్, వెలుగు: నేషనల్ హెల్త్ మిషన్(ఎన్ హెచ్ఎం) కార్యక్రమాల అమలు కోసం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. ఆరు నెలల నుంచి నిధులు విడుదల చేయలేదు. దీంతో మూడు నెలలుగా ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం పరిధిలో పనిచేస్తున్న 17 వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు ఆగిపోయాయి. జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు గురువారం కోఠిలోని స్టేట్ ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం హెడ్ క్వార్టర్ వద్ద ధర్నాకు దిగారు.

 ఆపై ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం డైరెక్టర్‌‌‌‌‌‌‌‌, ఫ్యామిలీ వెల్పేర్ కమిషన్‌‌‌‌ ఆర్వీ కర్ణన్‌‌‌‌కు వినతిపత్రం ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయని, అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని వారికి వివరించారు.  త్వరగా వేతనాలు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం కాంట్రాక్ట్‌‌‌‌ అండ్ అవుట్‌‌‌‌సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.