నోయిడాలో ఇటీవల ఓ మహిళను దుర్భాషలాడిన బీజేపీకి చెందిన కిసాన్ మోర్చా సభ్యుడు శ్రీకాంత్ త్యాగి ఇంటిపై అధికారులు పంజా ఝులిపించారు. నోయిడా సెక్టార్ -93 గ్రాండ్ ఒమాక్స్ వద్ద ఉన్న శ్రీకాంత్ త్యాగికి చెందిన అక్రమ ఇంటి నిర్మాణాన్ని అధికారులు బుల్డోజర్ తో కూల్చివేశారు. ఇటీవల హౌసింగ్ సొసైటీలో జరిగిన గొడవలో ఓ మహిళ పట్ల శ్రీకాంత్ త్యాగి అసభ్యంగా ప్రవర్తించాడు. తాను ఉంటున్న హౌసింగ్ సొసైటీలో ఆమె చెట్లు నాటడానికి శ్రీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా అలా చేసే హక్కు ఉందంటూ ఆమెపై దాడి చేయడంతో పాటు మహిళ భర్తను అసభ్య పదజాలంతో దూషించాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో ఎన్‌సిడబ్ల్యును ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై వేగవంతమైన దర్యాప్తు జరిగేలా చూడాలని ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్‌కు ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్ రేఖా శర్మ లేఖ రాశారు. కాగా, శ్రీకాంత్‌పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా శ్రీకాంత్ త్యాగి ఇంటిని నోయిడా అధికారులు కూల్చివేశారు. దీనికి కారణం అక్రమ నిర్మాణమేని సమాచారం.
#WATCH | Uttar Pradesh: Noida administration demolishes the illegal construction at the residence of #ShrikantTyagi, at Grand Omaxe in Noida's Sector 93.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022
Tyagi, in a viral video, was seen abusing and assaulting a woman here in the residential society. pic.twitter.com/YirMljembh

