న్యూఢిల్లీ:టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ రాబోయే ఐదేళ్లలో రూ.40వేల కోట్ల భారీ మూలధన వ్యయం (కాపెక్స్) చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 2031 నాటికి దేశీయ మార్కెట్లో 20 శాతం వాటాను దక్కించుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వార్షిక విక్రయాలను 12 లక్షల యూనిట్లకు పైగా పెంచడం ద్వారా ఈ మార్కెట్ వాటాను సాధించాలని చూస్తోంది.
2031 నాటికి కంపెనీ ఆరు కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని యోచిస్తోంది. రాబోయే మూడేళ్లలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 13 లక్షల యూనిట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శైలేష్ చంద్ర తెలిపారు.
