లిఫ్ట్ లో పెంపుడు కుక్క.. మహిళను కొట్టిన రిటైర్డ్ IAS అధికారి

లిఫ్ట్ లో పెంపుడు కుక్క.. మహిళను కొట్టిన రిటైర్డ్ IAS అధికారి

నోయిడాలోని సెక్టార్ 108లోని పార్క్ లారేట్ సొసైటీలో తన పెంపుడు జంతువుతో లిఫ్ట్ దిగేందుకు వచ్చిన ఓ మహిళను వ్యతిరేకించడంతో.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ గుప్తా, ఓ మహిళ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో.. వారు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను రికార్డ్ చేయకుండా గుప్తాను ఆపడానికి ప్రయత్నించడంతో IAS అధికారి మహిళను చెంపదెబ్బ కొట్టడం కూడా ఇందులో చూడవచ్చు. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో, మహిళ కూడా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి దెబ్బలను అడ్డుకోవడానికి తన చేతిని ఉపయోగించడం సైతం ఈ వీడియోలో కనిపిస్తుంది.

ఆ తర్వాత మహిళ భర్త అక్కడికి వచ్చి మాజీ ఐఏఎస్ అధికారిని దారుణంగా దూషించాడని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, లిఫ్ట్‌లో కుక్కను తీసుకెళ్లే విషయంలో వివాదం తలెత్తింది. ఇద్దరి మధ్య ఫిజికల్ గా కూడా ఫైట్ జరిగిందని ఓ యూజర్ ఎక్స్‌లో రాశారు.

పెట్ పాలసీ ఏం చెబుతుందంటే..

పెట్ పాలసీ ప్రకారం జంతులుసను నమోదు చేయకుంటే రూ.500 జరిమానా విధిస్తారు. 2022 డిసెంబర్‌లో డాగ్ పాలసీని అమలు చేసినప్పుడు మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులోకి వచ్చిందని నోయిడా అథారిటీ ఓఎస్‌డీ ఇందు ప్రకాష్ సింగ్ చెప్పారు. ప్రజలు తమ పెంపుడు జంతువులను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 30 మార్చి 2023గా నిర్ణయించారు. ఆ తర్వాత, పెంపుడు జంతువును నమోదు చేసినందుకు రూ. 500 వసూలు చేస్తారు. పెంపుడు జంతువుల యజమానులందరికీ ఇది తప్పనిసరి అని ఇందు ప్రకాష్ సింగ్ నొక్కిచెప్పారు.

ఎలా నమోదు చేసుకోవాలంటే..

కుక్కల డేటాబేస్ నిర్వహించడం ఈ నమోదుతో సులభతరం అవుతుందని, కౌంటింగ్ కూడా పక్కాగా కొనసాగుతుందని ఓఎస్డీ ఇందు ప్రకాశ్ తెలిపారు. ఇప్పటి వరకు కేవలం 3 వేల పెట్స్ మాత్రమే నమోదు అయ్యాయి. నోయిడా అథారిటీని సంప్రదించడానికి, 0120-2425025, 26, 27కి కాల్ చేయవచ్చు. ఈ నంబర్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. లేదా 92055-59204 ను కూడా సంప్రదించవచ్చు.