కోళ్లతో కరోనాకి చెక్..యాంటీ బాడీలపై సైంటిస్ట్ ల ప్రయోగం

కోళ్లతో కరోనాకి చెక్..యాంటీ బాడీలపై సైంటిస్ట్ ల ప్రయోగం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్  కోసం సైంటిస్ట్ లు నిర్విరామంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో పలు దేశాలకు చెందిన సైంటిస్ట్ లు కరోనా వ్యాక్సిన్ కోసం చేస్తున్న శ్రమ వృదా అవుతున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి రావాలంటే తప్పని సరిగా మూడు దశల్లో హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించాలి. ఈ ట్రయల్స్ ఫెయిలవుతున్నట్లు తెలుస్తోంది.  అయినా సరే  టీకాతోపాటు మాత్రలు, నాజల్ డ్రాప్స్ ను తయారు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో కోడి నుంచి యాంటీబాడీస్ తీసుకుని కరోనా తీవ్రతను తగ్గించవచచ్చని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు నిర్ధారించారు. ఎలుకలు, పందులతో మనుషులకు చాలా పోలికలు ఉన్నట్టే కోళ్లతోనూ మనుషులకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. మనుషుల్లో మాదిరే కోళ్లలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. కోడిగుడ్లలోని యాంటీబాడీలు కరోనా నుంచి కొంత కాలం రక్షణ కల్పిస్తాయని స్టాన్‌ఫర్డ్ సైంటిస్ట్  డేరియా మూచీ రోజెన్ తెలిపారు. ప్రస్తుతం కరోనా నిరోధక నాజల్ స్ప్రేను  48 మంది పేషంట్లపై ప్రయోగాలు నిర్వహిస్తున్నామని, పూర్తి ఫలితాలు వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.