రాజకీయ కక్ష కాదు.. చట్ట ప్రకారమే కేసీఆర్‌‌‌‌కు నోటీసులు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

రాజకీయ కక్ష కాదు.. చట్ట ప్రకారమే కేసీఆర్‌‌‌‌కు నోటీసులు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సిట్ నోటీసులు ఇవ్వడం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తమకు ఎవరిపై రాజకీయ కక్ష లేదని చెప్పారు. గురువారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మహేశ్ గౌడ్ మాట్లాడారు. ‘‘ఉద్యమ నేతగా కేసీఆర్ అంటే మాకు గౌరవం ఉంది. కానీ, ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరం. ఈ కేసులో నాతో పాటు చాలా మంది నేతలు, ఇతర రంగాల ప్రముఖులు పోలీసుల ముందు స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు ఇచ్చాం. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆనాడు ఆయనకు తెలియకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేయలేరు. కాబట్టి వాస్తవాలు బయటకు రావాలంటే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విచారించాల్సిందే” అని మహేశ్ గౌడ్ అన్నారు.