7 హిల్స్ మాణిక్ చంద్ కేసు.. ఈడీ విచారణకు అభిషేక్ ఆవుల

7 హిల్స్ మాణిక్ చంద్ కేసు.. ఈడీ విచారణకు అభిషేక్ ఆవుల

హైదరాబాద్​ : 7 హిల్స్ మాణిక్​ చంద్ ప్రొడక్ట్స్ యాజమాని అభిషేక్ ఆవుల ఈడీ విచారణకు హాజరయ్యారు. మాణిక్ చంద్ కేసులోనే తనకు నోటీసులు ఇచ్చారని అభిషేక్ తెలిపారు. ఎమ్మెల్యేల  కొనుగోలు కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డితో తనకు లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. మాణిక్ చంద్ గుట్కా వ్యాపారంలో తనను పిలిచారని..అన్ని వివరాలు ఈడీకి సమర్పిస్తానని అభిషేక్ తెలిపారు. ఈడీ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. నందకుమార్ పై గతంలోనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.

మనీలాండరింగ్‌‌‌‌ కింద నమోదైన ఈసీఐఆర్ 48/22 కేసులో అభిషేక్ ఆవుల విచారణకు హాజరుకావాలని హైదరాబాద్‌‌‌‌ జోన్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ సుమిత్‌‌‌‌ గోయల్‌‌‌‌ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి మధ్య రూ.7 కోట్ల 50లక్షల లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే అభిషేక్ ఆవుల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.