మళ్లీ వచ్చార్రా బాబూ : షూలో కూల్ డ్రింక్.. మెట్రోలో డ్రింకింగ్

మళ్లీ వచ్చార్రా బాబూ : షూలో కూల్ డ్రింక్.. మెట్రోలో డ్రింకింగ్

మెట్రో వైరల్ కపుల్.. వీళ్లకు ఈ పేరు పెట్టారు నెటిజన్లు.. కూల్ డ్రింక్స్ తో.. ఢిల్లీ మెట్రోలో వీళ్లు చేసే చేష్టలు అలా ఉంటాయి మరి.. మళ్లీ వీళ్లు మరోసారి వైరల్ లోకి వచ్చారు.. దీంతో నెటిజన్లు.. మళ్లీ వచ్చార్రా బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇంతకీ వీళ్లు చేసిన పని ఏంటో తెలుసా.. అదీ తెలుసుకుందాం..

మగ, ఆడ జంట.. ఆ వ్యక్తి తన షూ విప్పి.. అందులో కూల్ డ్రింక్ పోసి.. స్ట్రాతో తాగుతాడు.. అదే స్ట్రాను పక్కనే ఉన్న అమ్మాయికి ఇస్తాడు.. ఇలా వీళ్లు.. మార్చి మార్చి షూలో కూల్ డ్రింక్ పోసుకుని తాగుతుంటారు.. వీరి చేష్టలు మరోసారి వైరల్ అయ్యాయి. 

ఇక షూ విషయానికి వస్తే బెటర్ క్వాలిటీగానే కనిపిస్తుంది. రంగు రంగుల్లో ఉంది. ఇంట్లో షూ వేసుకుని.. మెట్రో వెక్కిన తర్వాత.. ఈ పని చేస్తారు వీరు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వీళ్లకు.. కూల్ డ్రింక్ కు ఏదో సంబంధం ఉందని కామెంట్ చేస్తున్నారు. గతంలో వీళ్లు.. కూల్ డ్రింక్ ను నోట్లో పోసుకుని.. ఒకరి నోట్లో నుంచి మరొకరి నోట్లోకి పోసుకుంటూ ఉన్న వీడియోతోనే.. వీళ్లు వైరల్ అయ్యారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయోగంతోనే.. మళ్లీ సోషల్ మీడియాలో అటెన్షన్ క్రియేట్ చేయటం చర్చనీయాంశం అయ్యింది. ఛీ.. ఛీ అంటూనే లక్షల మంది ఈ వీడియో చూడటం విశేషం..

ఇక్కడ ఓ విషయాన్ని చెప్పుకోవాలి.. ఇలా షూలో కూల్ డ్రింక్ పోసుకుని తాగటం అనేది గతంలోనూ జరిగింది. ఆస్ట్రేలియా జట్టు.. ఓ మ్యాచ్ గెలిచిన సందర్భంగా.. డేవిడ్ వార్నర్.. తన షూలో షాంపెయిన్ పోసుకుని తాగుతాడు.. అలాంటి తరహాలోనే.. ఇప్పుడు ఈ మెట్రో జంట.. ప్రయోగం చేసి వైరల్ అయ్యారు..