
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఫైనల్ కు జకోవిచ్ చేరుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో జకోవిచ్ ఫైనల్ కు చేరడం ఇది పదోసారి కావడం విశేషం. మెల్‌బోర్న్ పార్క్‌లోని లార్డ్ లావెర్ అరెనాలో శుక్రవారం అమెరికాకు చెందిన టామీ పాల్ తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో జకోవిచ్ గెలిచాడు. 2 గంటల 20 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో తొమ్మిది సార్లు ఛాంపియన్ అయిన టామీ పాల్‌ను 7-5, 6-1, 6-2తో చిత్తుగా ఓడించి జకోవిచ్ టోర్నీ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లాడు. మెల్‌బోర్న్ పార్కులో జకోవిచ్‌కు ఇది వరుసగా 26వ విజయం. పదోసారి ఈ టోర్నీ ఫైనల్ చేరిన తొలి ఆటగాడిగా జకోవిచ్ రికార్డు క్రియేట్ చేశాడు. జకోవిచ్ఆదివారం స్టెఫానోస్ సిట్సిపాస్‌తో తలపడనున్నాడు.