కెరీర్‌‌‌‌‌‌‌‌లో 400వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ విజయంతో జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ చరిత్ర

కెరీర్‌‌‌‌‌‌‌‌లో 400వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ విజయంతో జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ చరిత్ర

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌: కెరీర్‌‌‌‌‌‌‌‌లో 25వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ వేటలో ఉన్న సెర్బియా సూపర్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌.. అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా శనివారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో నాలుగోసీడ్‌‌‌‌‌‌‌‌ జొకో 6–3, 6–4, 7–6 (7/4)తో బొటిక్‌‌‌‌‌‌‌‌ వాన్‌‌‌‌‌‌‌‌ డి జాండ్‌‌‌‌‌‌‌‌స్చుల్ప్‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టాడు. తాజా విజయంతో గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో 400 విజయాలు సాధించిన తొలి ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో స్విస్ లెజెండ్‌‌‌‌‌‌‌‌ రోజర్‌‌‌‌‌‌‌‌ ఫెడరర్‌‌‌‌‌‌‌‌ 102 విజయాల రికార్డును సమం చేశాడు. వాన్‌‌‌‌‌‌‌‌ డి జాండ్‌‌‌‌‌‌‌‌స్చుల్ప్‌‌‌‌‌‌‌‌తో 2 గంటలా 44 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో జొకో నియంత్రణతో కూడిన షాట్లు ఆడాడు. ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో యానిక్‌‌‌‌‌‌‌‌ సినర్‌‌‌‌‌‌‌‌ (ఇటలీ) 4–6, 6–3, 6–4, 6–4తో ఎలియట్‌‌‌‌‌‌‌‌ స్పిజ్జిరి (అమెరికా)పై, ముసెటి (ఇటలీ) 5–7, 6–4, 6–2, 5–7, 6–2తో మచాక్‌‌‌‌‌‌‌‌ (చెక్‌‌‌‌‌‌‌‌)పై గెలిచారు.  

టేలర్‌‌‌‌‌‌‌‌ ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) 7–6 (7/5), 2–6, 6–4, 6–4తో స్టాన్‌‌‌‌‌‌‌‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌)పై, షెల్టన్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) 6–4, 6–4, 7–6 (7/5)తో వాచెరోట్‌‌‌‌‌‌‌‌ (మొనాకో)పై, రుడ్‌‌‌‌‌‌‌‌ (నార్వే) 6–4, 6–4, 3–6, 7–5తో సిలిచ్‌‌‌‌‌‌‌‌ (క్రొయేషియా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ చేరారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో ఇగా స్వైటెక్‌‌‌‌‌‌‌‌ (పోలాండ్‌‌‌‌‌‌‌‌) జోరు కొనసాగుతోంది.మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో  ఇగా 6–1, 1–6, 6–1తో కల్నిస్కయా (రష్యా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్ చేరింది. ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో  అనిసిమోవా (అమెరికా) 6–1, 6–4తో స్టెర్న్స్‌‌‌‌‌‌‌‌ (అమెరికా)పై, రిబకినా (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌) 6–2, 6–3తో వాలెంటోవా (చెక్‌‌‌‌‌‌‌‌)పై, పెగులా (అమెరికా) 6–3, 6–2తో సెల్కెమెటేవా (రష్యా)పై, కీస్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) 6–3, 6–3తో ప్లిస్కోవా (చెక్‌‌‌‌‌‌‌‌)పై నెగ్గగా, ఒసాకా (జపాన్‌‌‌‌‌‌‌‌).. ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా)కు వాకోవర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో యూకీ బాంభ్రీ (ఇండియా)–గొరాన్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌ (స్వీడన్‌‌‌‌‌‌‌‌) 4–6, 7–6 (7/5), 6–3తో గొంజాలెజ్‌‌‌‌‌‌‌‌ (మెక్సికో)–డేవిడ్‌‌‌‌‌‌‌‌ పీల్‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించారు. మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌. శ్రీరామ్‌‌‌‌‌‌‌‌ బాలాజీ (ఇండియా)–నీల్ ఒబెర్లీట్నర్ (ఆస్ట్రియా) 5–7, 1–6తో అరెవాలో (ఎల్‌‌‌‌‌‌‌‌ సాల్వెడార్‌‌‌‌‌‌‌‌)–మాట్‌‌‌‌‌‌‌‌ పావిచ్‌‌‌‌‌‌‌‌ (క్రొయేషియా) చేతిలో ఓడారు.