హైదరాబాద్ vs ఆంధ్ర పోరుకు రంగం సిద్ధం.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సిరాజ్

హైదరాబాద్ vs ఆంధ్ర పోరుకు రంగం సిద్ధం.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సిరాజ్

Andhra vs Hyderabad: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో ఆసక్తికరమైన పోరుకు వేదిక సిద్ధమైంది. సండే స్పెషల్ మ్యాచ్‌గా రెండో రౌండ్‌లో భాగంగా రెండు పొరుగు తెలుగు రాష్ట్రాల జట్లైన హైదరాబాద్ వర్సెస్ ఆంధ్రా (Hyderabad vs Andhra) ఈరోజు (2026, అక్టోబర్ 18, ఆదివారం) ముఖాముఖి తలపడుతున్నాయి. విజయవాడ సమీపంలోని మూలపాడు దేవినేని వెంకట రమణ ప్రణీత స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. 

సిరాజ్ వర్సెస్ రికీ భుయ్ పోరు: 

* సారథ్య బాధ్యతల్లో సిరాజ్: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు వహిస్తుండటంతో జట్టు బౌలింగ్ విభాగంలో భారీ ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. జట్టులో తెలంగాణ టీ20 (TG20) విజేత కెప్టెన్ అభిరథ్ రెడ్డి, అనుభవజ్ఞులైన తన్మయ్ అగర్వాల్, సీవీ  మిలింద్, తనయ్ త్యాగరాజన్ ఉన్నారు.

* ఆంధ్రకు రికీ భుయ్ నాయకత్వం: స్టార్ బ్యాటర్ రికీ భుయ్ (Ricky Bhui) ఆంధ్రా జట్టుకు సారథిగా వ్యవహరిస్తుండగా, షేక్ రషీద్, అభిషేక్ రెడ్డి, కేవీ శశికాంత్‌లతో కూడిన పటిష్టమైన లైనప్‌ అందుబాటులో ఉంది.

తొలి మ్యాచ్ ఫలితాలు ఇవే: 

* హైదరాబాద్ ఉత్సాహం: రంజీ సీజన్ తొలి రౌండ్ మ్యాచ్‌లో త్రిపురపై ఘన విజయం సాధించిన సిరాజ్ సేన 6 పాయింట్లతో జోరు మీదుంది.

* ఆంధ్ర డ్రా: మరోవైపు బలమైన కర్ణాటక జట్టుతో జరిగిన తమ తొలి మ్యాచ్‌ను ఆంధ్ర టీమ్ డ్రా చేసుకుని మ్యాచ్‌ను సమం చేసుకుంది. 

హెడ్-టు-హెడ్ రికార్డుల్లో హైదరాబాద్‌ హవా: 

* రంజీ ట్రోఫీ సుదీర్ఘ చరిత్రలో హైదరాబాద్ వర్సెస్ ఆంధ్రా జట్లు ఇప్పటి వరకు 44 సార్లు ముఖాముఖి పోటీపడ్డాయి. 

* హైదరాబాద్ విజయాలు: 25 మ్యాచ్‌లు

* ఆంధ్ర విజయాలు: 2 మ్యాచ్‌లు

* డ్రాగా ముగిసినవి: 17 మ్యాచ్‌లు

* గత రికార్డులు హైదరాబాద్‌కే పూర్తి ఆధిక్యాన్ని చూపిస్తున్నప్పటికీ, సొంతగడ్డపై విజయవాడ వేదికగా ఆడుతుండటం ఆంధ్రా జట్టుకు కలిసొచ్చే అంశం అని చెప్పాలి. 

ఇరు జట్లు (Playing XI):

హైదరాబాద్: తన్మయ్ అగర్వాల్, అభిరథ్ రెడ్డి, గహ్లౌత్ రాహుల్ సింగ్, ప్రగ్నయ్ రెడ్డి (వికెట్ కీపర్), కొడిమెల హిమతేజ, రుతిక్ యాదవ్ మెండే, రాహుల్ రాదేశ్, చామ వీ మిలింద్, అనికేత్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ (కెప్టెన్), తనయ్ త్యాగరాజన్.

ఆంధ్రా: మారంరెడ్డి హేమంత్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, షేక్ రషీద్, రికీ భుయ్ (కెప్టెన్), సీరం వెంకట రాహుల్, రేవంత్ రెడ్డి (వికెట్ కీపర్), KV శశికాంత్, సౌరభ్ కుమార్, త్రిపురాన విజయ్, లలిత్ మోహన్, కావూరి సాయితేజ.