ఇండియా vs జింబాబ్వే రెండో టీ20 మ్యాచ్‌‌‌‌ కు రెడీ

ఇండియా vs జింబాబ్వే రెండో టీ20 మ్యాచ్‌‌‌‌ కు రెడీ

రాయ్‌‌‌‌పూర్‌‌‌‌: జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్‌‌‌‌కు ఇండియా విమెన్స్‌‌‌‌ జట్టు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే ఈ పోరులో గెలిచి ఇక్కడే సిరీస్‌‌‌‌ పట్టేయాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది జరగాలంటే స్మృతి సేన టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి రావాల్సి ఉంది. తొలి మ్యాచ్‌‌‌‌లో జరిగిన తప్పులను మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని కెప్టెన్‌‌‌‌ స్మృతి మంధాన భావిస్తోంది. 

తనతో పాటు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే ఔటైన షెఫాలీ వర్మ, అనుష్క శర్మ, హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌లో బ్యాట్లు ఝుళిపించాలని చూస్తున్నారు. బౌలర్లలో పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. కీలక టైమ్‌‌‌‌లో వికెట్లు తీయడంతో పాటు రన్స్‌‌‌‌కూడా అడ్డుకుంటున్నారు. మరోవైపు జింబాబ్వే కూడా ఈ మ్యాచ్‌‌‌‌లో గెలిచి సిరీస్‌‌‌‌పై ఆశలు నిలుపుకోవాలని భావిస్తోంది. అయితే ఓపెనర్‌‌‌‌ కెలిస్‌‌‌‌ ఎన్డోవ్‌‌‌‌, షార్నే మేయర్స్‌‌‌‌ మినహా మిగతా వారు బ్యాటింగ్‌‌‌‌లో ఫెయిల్‌‌‌‌ కావడం మైనస్‌‌‌‌గా మారింది. బౌలింగ్‌‌‌‌లో స్పిన్నర్‌‌‌‌ గ్వాంజురా కీలకం కానుంది.