కోఠి, వెలుగు: పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్‌ఎస్ ఆఫీస్ ఎదుటు నర్సింగ్ ఆఫీసర్‌గా ఎంపికైన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. నియామకపత్రాలు ఇచ్చి పోస్టింగ్‌లు ఇవ్వడం లేదని వాపోయారు. వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మద్దతు ప్రకటించారు.
అభ్యర్థుల సమస్యను డీఎంహెచ్‌ఎస్ రవీందర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థులకు పోస్టింగ్‌లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. దీక్షా శిబిరానికి వచ్చి ఈ నెల 20లోగా పోస్టింగ్ ఆర్డర్లు అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
