ధరలు పెరుగుతున్నయ్​

ధరలు పెరుగుతున్నయ్​

నవంబర్ రిటైల్​ ద్రవ్యోల్బణం 5.54 శాతం 3.8 శాతానికి తగ్గిన ఐఐపీ

రిటైల్​ ద్రవ్యోల్బణం గత నెలలో 5.54 శాతానికి పెరిగింది. ఇది ఆర్‌‌‌‌బీఐ నిర్దేశించుకున్న 4 శాతం లక్ష్యం కంటే చాలా ఎక్కువ. రిటైల్​ ద్రవ్యోల్బణం ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో 4.62 శాతంగా, గతేడాది నవంబర్‌‌‌‌లో 2.33 శాతంగా రికార్డయింది. కన్జూమర్ ప్రైస్​ఇండెక్స్​లో ఆహారానికి 45 శాతంవాటా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో నవంబర్‌‌లో రిటైల్​ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. పడిపోయిన పరిశ్రమల ఉత్పత్తి.. ఇండెక్స్​ఆఫ్ ఇండస్ట్రియల్​ ప్రొడక్షన్(ఐఐపీ) అక్టోబర్ నెలలో 3.8 శాతానికి పడిపోయింది. పవర్, మైనింగ్, తయారీ రంగాలు మందగించడంతో ఫ్యాక్టరీల ఔట్‌ పుట్​​పడిపోయింది. నెమ్మదిస్తున్న ఆర్థిక వ్యవస్థ వలన తయారీరంగం అక్టోబర్ నెలలో 2.1 శాతానికి తగ్గింది. గతేడాది అక్టోబర్ నెలలో ఇది 8.2 శాతం పెరిగింది. పవర్ జనరేషన్​ సెక్టార్ 12.2 శాతం పడిపోయింది. ఈ సెక్టార్ గతేడాది అక్టోబర్‌‌‌‌లో 10.8 శాతం వృద్ధి చెందింది.