గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీతో కలిసి బ్యాటరీ సెల్స్ తయారీలోకి మహీంద్రా

గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీతో కలిసి బ్యాటరీ సెల్స్ తయారీలోకి మహీంద్రా

 న్యూఢిల్లీ: బ్యాటరీ సెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఇండియాలో తయారు చేసేందుకు గ్లోబల్ కంపెనీలతో పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకోవాలని మహీంద్రా గ్రూప్ చూస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడకం ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరింత పెరుగుతుందని, డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేరుకోవడానికి  బ్యాటరీ సెల్స్ తయారీలోకి  రావొచ్చని మహీంద్రా గ్రూప్ ఎండీ అనిశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షా అన్నారు. 2030 లో  మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్టింగ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

 ‘సెల్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జాగ్రత్తగా గమనిస్తున్నాం. బ్యాటరీ సెల్స్ అత్యవసరమని మాకు అనిపించినప్పుడు గ్లోబల్ కంపెనీలతో కలిసి వీటి తయారీలోకి దిగుతాం’ అని అనిశ్ వివరించారు. టెక్నాలజీ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం చూస్తామని, అంతేకాకుండా ప్రైవేట్ ఈక్విటీ పార్టనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం కూడా చూస్తామని పేర్కొన్నారు.  మహీంద్రా  గ్రూప్ రానున్న మూడేళ్లలో వివిధ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో రూ.37 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంది. ఇందులో మెజార్టీ భాగం వెహికల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఇన్వెస్ట్ చేయనుంది.