గర్భిణిని జోలెలో మోసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఒడిశా ఎమ్మెల్యే

గర్భిణిని జోలెలో మోసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఒడిశా ఎమ్మెల్యే

గెలిపిస్తే అందుబాటులో ఉండటంతో పాటు…అండగా ఉంటానన్న హామీ నిలబెట్టుకున్నారు ఓ ఎమ్మెల్యే. పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండి గర్భిణిని జోలెలో దాదాపు 5 కిలో మీటర్లు మోసుకుంటూ వెళ్లి ఆమెను స్థానిక ఆస్పత్రికి చేర్చారు. ఈ ఘటన ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలో జరిగింది.

నవరంగపూర్‌ జిల్లా, పపడహండి సమితి సమీపంలోని కుసుముగుడ. రవాణ సౌకర్యాలు కూడా లేని మారుమూల ప్రాంతం.ఇప్పటికీ బస్సు సదుపాయం కూడా లేదు. దీంతో చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లాంటే నడుచుకుంటూ వెళ్లాల్సిందే. అంతేకాదు అక్కడ ఆస్పత్రి కూడా లేదు.

నెలలు నిండిన జెమ బెహర అనే మహిళకు సోమవారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. అదే సమయంలో డాబుగాంకి చెందిన ఎమ్మెల్యే మనోహర రొంధారి స్థానికంగా ఉన్న గ్రామంలో పర్యటిస్తున్నారు. విషయం తెలుసుకుని అక్కడి వచ్చారు. వెంటనే ఆయన ఆంబులెన్స్‌కి ఫోన్ చేయగా, రోడ్లు బాలేదని.. గ్రామానికి రావడానికి నిరాకరించారు ఆస్పత్రి సిబ్బంది.

దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా… గ్రామస్తులు ఏర్పాటు చేసిన జోలీలో ఆమెను ఉంచి..స్థానికులతో పాటు ఎమ్మెల్యేకూడా 5 కిలోమీటర్లు  మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చారు. తమ పట్ల మానవత్వం చూపిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.