బాల్యవివాహాలను అరికట్టాలి :  కలెక్టర్ సత్యశారద

బాల్యవివాహాలను అరికట్టాలి :  కలెక్టర్ సత్యశారద

ఖిలా వరంగల్​(మామునూరు) / భద్రాచలం/ టేకులపల్లి, వెలుగు: బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి అక్కరూ కృషి చేయాలని ఆఫీసర్లు పిలుపునిచ్చారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో మంగళవారం వరంగల్​ జిల్లా గుంటూరుపల్లిలో నిర్మించిన అంగన్​వాడీ భవనాన్ని కలెక్టర్​ సత్యశారద, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి ప్రారంభించారు. వరంగల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 'స్నేహ' కార్యక్రమం ప్రారంభిస్తే, రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిందన్నారు.

మహిళలు, కౌమార దశలో ఉన్న చిన్నారుల సంక్షేమానికి స్నేహ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. భద్రాచలం ఐసీడీఎస్​ సీడీపీవో జ్యోతి ఆధ్వర్యంలో బాలికా సంరక్షణ ప్రోగ్రామ్​ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్​పూనెం కృష్ణదొర మాట్లాడుతూ 14 ఏండ్లపై బడిన బాలికలకు హెచ్​పీవీ వ్యాక్సిన్​ ఇప్పించాలన్నారు. టేకులపల్లి సెక్టార్​ సూపర్​వైజర్​ అనురాధ ఆధ్వర్యంలో పోషక విలువలపై అవగాహన కార్యక్రమంలో ఐసీడీఎస్​ సీడీపీవో కె.మంగతార పాల్గొని మాట్లాడారు.