నాలుగు నగరాల్లో ఎస్.ఎస్. తమన్ ఓజీ మ్యూజికల్ ఈవెంట్

నాలుగు నగరాల్లో ఎస్.ఎస్. తమన్ ఓజీ మ్యూజికల్ ఈవెంట్

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్, ఏసీటీసీ ఆధ్వర్యంలో ‘ఓజీ టూర్ ఇండియా’  పేరుతో  మ్యూజికల్ ఈవెంట్‌‌‌‌ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌లోని బౌల్డర్ హిల్స్‌‌‌‌లో జూన్ 13న ఈవెంట్ జరగనుంది. ఈ మ్యూజికల్ ఈవెంట్‌‌‌‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ నిర్వాహకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ‘‘ఓజీ’  సినిమా అప్రిషియేషన్ సెలబ్రేషన్‌‌‌‌ను కొనసాగిస్తూ ‘ఓజీ టూర్ ఇండియా’ను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌‌‌‌లో తొలిసారిగా ఈ ఈవెంట్ నిర్వహించడం ఆనందంగా ఉంది.

అనిరుధ్ గారి ‘హుకుం టూర్’ ఎంతటి ప్రభావాన్ని చూపిందో, మనకు ‘ఓజీ టూర్’ కూడా అంతటి బలాన్ని ఇచ్చింది.  ఎక్కడ చూసినా ‘ఓజీ’ మ్యూజిక్ వినిపిస్తోంది. ఆ సెలబ్రేషన్‌‌‌‌ను ఒక ఐకాన్‌‌‌‌గా తీసుకుని ఈ కాన్సర్ట్‌‌‌‌ను రూపొందించాం.  జూన్ 13న హైదరాబాద్‌‌‌‌ తర్వాత  జులై 11న  బెంగళూరులో, ఆగస్టు 15న చెన్నైలో, సెప్టెంబర్ 25న వైజాగ్‌‌‌‌లో ఈవెంట్లు నిర్వహించబోతున్నాం. 

ఈ నాలుగు నగరాల్లో జరగనున్న టూర్‌‌‌‌కు హైదరాబాద్ నుంచే గ్రాండ్‌‌గా స్టార్ట్ ఇస్తున్నాం. నేను చేసే ప్రతి షో ద్వారా వచ్చే రెమ్యునరేషన్‌‌‌‌ను  ఎప్పుడూ ఛారిటీకి అందిస్తుంటాను. ఈ షోకు సంబంధించిన వివరాలను కూడా కార్యక్రమం పూర్తైన తర్వాత వెల్లడిస్తాను’ అని చెప్పాడు.