అమీర్ పేట్ లో పాత వైరింగ్ తోనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు : హైడ్రా క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ ఏవీ రంగనాథ్

అమీర్ పేట్ లో పాత  వైరింగ్ తోనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు : హైడ్రా క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ ఏవీ రంగనాథ్
  • కెపాసిటీకి మించి క‌‌‌‌రెంటు వినియోగంతో షార్ట్ స‌‌‌‌ర్క్యూట్స్ 
  •      హైడ్రా కమిషనర్​​ రంగనాథ్​
  •     మైత్రీవనం అగ్ని ప్రమాద స్థలం  పరిశీలన

హైదరాబాద్  సిటీ, వెలుగు : అమీర్ పేట్ లో ఫైర్  యాక్సిడెంట్ జరిగిన షాపింగ్ కాంప్లెక్స్‌‌‌‌ను శుక్రవారం హైడ్రా క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ ఏవీ రంగనాథ్  ప‌‌‌‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఎక్కువగా పాత కరెంట్​వైరింగ్, కెపాసిటీకి మించి క‌‌‌‌రెంటు వినియోగం వ‌‌‌‌ల్ల త‌‌‌‌ర‌‌‌‌చూ షార్ట్ స‌‌‌‌ర్క్యూట్స్ ఏర్పడి అగ్ని ప్రమాదాలు జ‌‌‌‌రుగుతున్నాయ‌‌‌‌న్నారు.  అమీర్‌‌‌‌పేటలో జ‌‌‌‌రిగిన అగ్ని ప్రమాదానికి ప‌‌‌‌క్కనే ఉన్న మెస్‌‌‌‌కు సంబంధించి చిమ్నీల ద్వారా నిప్పుర‌‌‌‌వ్వలు ప‌‌‌‌డ‌‌‌‌డంతో జ‌‌‌‌రిగింద‌‌‌‌ని, మ‌‌‌‌రోవైపు ఏసీలు రిపేర్లలో ఉన్నాయని షార్ట్ స‌‌‌‌ర్క్యూట్ తో జరిగినట్లు ఇక్కడి వారు చెబుతున్నారన్నారు. పాత బిల్డింగ్ కావడంతో ఎంట్రీ, ఎగ్జిట్ ఒకటే ఉందన్నారు. ఘటనపై పూర్తి స్థాయి ద‌‌‌‌ర్యాప్తు జ‌‌‌‌రుగుతోంద‌‌‌‌న్నారు. 

ప్రతి బిల్డింగ్​ను చెక్​ చేస్తాం 

సిటీలో చాలా వరకు భవనాలు, వ్యాపార, దుకాణ సముదాయాలకు ఫైర్ ఎన్‌‌‌‌వోసీలు లేవని, ఇకపై ప్రతి భవనాన్ని తనిఖీ చేస్తామని హైడ్రా చీఫ్​రంగనాథ్​తెలిపారు. రూల్స్​పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఫైర్ ఎన్‌‌‌‌వోసీల జారీ, తనిఖీలు, నిబంధనల అమలు తీరులో త్వరలోనే  మార్పులు రానున్నాయన్నారు. 

ఫైర్ ​సేఫ్టీపై స్ట్రిక్ట్​ రూల్స్​

అగ్ని ప్రమాదాల అడ్డుకట్టకు సంబంధించి కఠినమైన విధివిధానాలు, నియమ నిబంధనలు రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం  కసరత్తు చేస్తోందని హైడ్రా చీఫ్​తెలిపారు. దీనిపై సోమవారం  కీలకమైన ఉన్నత స్థాయి సమావేశం జరగనున్నదన్నారు. ఆ విధివిధానాల ఆధారంగానే హైడ్రా తదుపరి కార్యాచరణ, చర్యలు ఉంటాయన్నారు. 

వర్షాకాలం ఏ సమస్య వచ్చినా చెప్పండి

వర్షాకాలం వాటర్‌‌‌‌ లాగింగ్‌‌‌‌ సమస్యలు ఎక్కడ తలెత్తినా హైడ్రా దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చూపిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. శుక్రవారం ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి వర్షాకాల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించిన ఆయన, ఎంఎంసీ పరిధిలో 188 వాటర్‌‌‌‌ లాగింగ్ పాయింట్లు ఉన్నాయని తెలిపారు. వర్షాకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 12 డీఆర్‌‌‌‌ఎఫ్ బృందాలు, 74 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌‌‌‌లు,175 మంది స్టాటిక్ సిబ్బందిని  సిద్ధంగా ఉన్నారన్నారు. ఎంఎంసీ పరిధిలోని 9 చెరువులకు ఫ్లడ్ గేట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేషన్‌‌‌‌లో 14 సర్కిళ్ల కి సంబంధించి  ప్రస్తుతం ఉన్న 12 డీఆర్‌‌‌‌ఎఫ్ బృందాలకు అదనంగా మరో రెండు బృందాలు కేటాయించాలని కోరారు. హైడ్రా అడిషనల్​డైరెక్టర్ వర్ల పాపయ్య, అడిషనల్​ కమిషనర్ ఆర్ సుదర్శన్, జలమండలి ఈడీ పంకజ పాల్గొన్నారు.


బాధితులకు పరిహారం చెల్లించాలి

జూబ్లీహిల్స్, వెలుగు: నగరంలోని అమీర్‌‌‌‌పేట మైత్రివనం ఎదురుగా అగ్ని ప్రమాదంలో కాలిపోయిన షాపింగ్ కాంప్లెక్స్‌‌‌‌ను శుక్రవారం టీఆర్ఎస్​చీఫ్​కల్వకుంట్ల కవిత పరిశీలించారు. బాధిత వ్యాపారులను పరామర్శించారు. 3 నెలలుగా సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అమీర్‌‌‌‌పేటలో జరిగిన ఈ ప్రమాదం ఆకస్మికంగా జరిగిన ఘటన కాదన్నారు. ప్రమాద సూచనలు ముందుగానే ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. దాదాపు రూ.4 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారని, వారికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలు తిరిగి తమ జీవనోపాధిని ప్రారంభించుకునేలా ప్రభుత్వం ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.