హైదరాబాద్ లో ఔటర్ రింగురోడ్డుపై రెండు ఘోర ప్రమాదాలు.. ఒకరు మృతి..

హైదరాబాద్ లో ఔటర్ రింగురోడ్డుపై రెండు ఘోర ప్రమాదాలు.. ఒకరు మృతి..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్ లో జరిగిన రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. శుక్రవారం ( మే 2 ) జరిగిన ఈ ప్రమాదాల్లో ఒకరు మృతి చెందారు. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఎల్బీ నగర్ కామినేని ప్లై ఓవర్ పై కారు బీభత్సం సృష్టించింది.. ఓవర్ స్పీడ్ తో మారుతి ఆల్టో కారు డివైడర్ ను ఢీకొట్టిన ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఔటర్ పై కారు బోల్తా కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్ ఎక్సిట్ 12 దగ్గర చోటు చేసుకుంది ఈ ఘటన. బ్రేజా కారు  ప్రమాదవశాత్తూ అదుపుతప్పి డివైడర్ ను డీకొట్టడంతో బోల్తా కొట్టింది. 

ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు  కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రాహీంపట్నం మార్చురికి తరలించారు.