సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్ పూర్లో అర్దరాత్రి గన్ ఫైర్ కలకలం రేపింది. ఎయిర్ గన్ మిస్ ఫైర్ కావడంతో ఒకరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటుండగా గన్ మిస్ ఫైర్ అయ్యిందని చెబుతున్నారు. దాంతో ముస్తాఫా ఖాన్ అనే యువకుడు తలకి బలమైన గాయం కావడంతో చనిపోయాడు. సలాక్ పూర్ నుంచి సిద్దిపేటకు హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో విచారణ చేపట్టిన పోలీసులు.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
