కరోనాతో చనిపోయిన డాక్టర్లు, స్టాఫ్ లలో ఒక్కరీకి సాయం అందలే

కరోనాతో చనిపోయిన డాక్టర్లు, స్టాఫ్ లలో ఒక్కరీకి సాయం అందలే
  • కరోనాతో చనిపోయిన డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ను ఆదుకోవాలె
  • వైరస్ సోకితే ఎటు పోవాల్నోతమకే తెలుస్తలేదన్న హెల్త్ స్టాఫ్

కరోనా బారిన పడి చనిపోయిన డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ కు  హెల్త్ వర్కర్లు నివాళి అర్పించారు. అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో బుధవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు . ఈ సందర్భంగా గవర్న మెంట్ డాక్టర్స్‌‌ అసోసియేషన్ ప్రతినిధులు లాలూ ప్రసాద్‌‌, పుట్లశ్రీనివాస్‌‌, నరహరి, బొంగు రమేశ్‌ తదితరులు మాట్లాడుతూ.. కరోనాతో చనిపోయిన డాక్టర్లు , మెడికల్ స్టాప్ కుటుంబాలను సర్కారు ఆదు కోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.కోటి చొప్పున ఎక్స్‌‌గ్రేషియా అందించాలన్నారు. రాష్ట్ర సర్కార్ నుంచి ఇప్పటివరకూ ఒక్కరికి కూడా సహకారం అం దలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ కు  కరోనా వస్తే ఎక్కడికి వెళ్లాలో స్పష్టతనివ్వా లని, నిమ్స్‌‌లో వారికి ట్రీట్‌‌మెంట్ అందడం లేదని చెప్పారు. సెప్టెం బర్‌ వరకూ కరోనా తగ్గుతుందనడాన్ని డాక్టర్లు తప్పబట్టారు. వైరస్ ఇంకా ఎంత కాలం ఉంటుందో తెలియదని, అప్పటివరకూ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయాల్సిందేనన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎక్స్‌‌గ్రేషియా తదితర విషయాల్లో స్ప ష్టమైన నిర్ణయం ప్రకటించాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.

కరోనాతో నిలోఫర్‌‌ ఈసీజీ టెక్నీషియన్ మృతి

నిలోఫర్ హాస్పిటల్లో ఈసీజీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మధులత (35) కరోనాతో బుధవారం మృతిచెందారు. 15 రోజుల క్రితం ఆమెకు కరోనా వచ్చింది. 8 రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నఆమెకు గాలి పీల్చుకోవడం ఇబ్బంది కావడంతో గాంధీలో చేర్పించారు. వారం రోజులుగా ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్న ఆమె బుధవారం మృతిచెందినట్లు డాక్టర్లు  తెలిపారు. ఆమె భర్తకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ట్రీట్‌‌మెంట్ తీసుకున్నారు. మధులతకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మధులత నీలోఫర్ హాస్పిటల్లో పదేండ్లుగా ఔట్‌‌సో ర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె మృతిపై నిలోఫర్‌, గాంధీ వైద్య సిబ్బంది విచారం వ్యక్తం చేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ మాట్లాడుతూ మధులత కుటుంబా నికి ప్రభుత్వం అండగా ఉండి, కోటి రూపాయాల ఎక్స్‌‌గ్రేషియాతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి సర్కార్‌ జాబ్‌ ఇవ్వాలని కోరారు.