వన్‌ప్లస్ నార్డ్2కు సక్సెసర్‌గా.. వన్‌ప్లస్ నార్డ్2టి 5జి పేరుతో మన దేశంలో ఇంకొక మొబైల్ లాంచ్ చేసింది వన్‌ప్లస్. మీడియాటెక్ డైమెన్సిటీ 1,300 ప్రాసెసర్‌తో లాంచ్ అయింది ఈ మొబైల్. 8జిబి ర్యామ్, 128 జిబి మెమరీ, 12జిబి ర్యామ్ 256 జిబి మెమరీ వేరియంట్లలో వస్తున్నట్టు చెప్పింది వన్‌ప్లస్. అంతేకాకుండా 80వాట్ సూపర్ ఊక్ ఛార్జర్, 4,500 ఎంఎహెచ్ బ్యాటరీ, 50 ఎంపి ప్రైమరీ కెమెరా, 32 ఎంపి సెకండరీ కెమెరాలు ఉన్నాయి. 6.43 ఫుల్ హెచ్‌డి ప్లస్ ఆమోలెడ్ స్క్రీన్ ,90 హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో ఉన్న ఈ మొబైల్ ధర 28,999 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. రేపటినుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.
