వన్​ప్లస్​ దోశ తినేది కాదు, చూసేది.!

వన్​ప్లస్​ దోశ తినేది కాదు, చూసేది.!

దోశ.. అనంగనే లొట్టలేసుకుంటూ తిందమనుకుంటున్నరేమో..! ఇది చట్నీలో అద్దుకునో, సాంబార్​లో కలుపుకునో తినే దోశ కాదండీ బాబూ! ఇది మస్తు..మస్తు బొమ్మలు చూపించే దోశ! అర్థం కాలేదా? ఇది ‘దోశ టీవీ’! షాకయ్యారా! ప్రముఖ మొబైల్​ కంపెనీ వన్​ప్లస్​ కంపెనీ తీసుకొస్తుందని చెబుతున్న ‘దోశ టీవీ’! కొన్ని రోజులగా ఈ దోశ టీవీపై సోషల్​ మీడియాలో తెగ చర్చలు నడుస్తున్నాయి. అయితే, అది జస్ట్​ కోడ్​నేమ్​ అన్న చర్చ కూడా నడుస్తోంది. కేవలం ఇండియాకే దీనిని స్పెషల్​గా తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు. సెప్టెంబర్​లో దానిని లాంచ్​ చేసే అవకాశమున్నట్టు సమాచారం. ఆ టీవీకి సంబంధించి ఫీచర్లు కూడా సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నాయి. 1080 రిజల్యూషన్​తో మాత్రమే పనిచేసే ఈ టీవీ స్క్రీన్​, 4కేకి కూడా అనువుగా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. క్వాడ్​కోర్​ మీడియాటెక్​ ఎంటీ5670 చిప్​సెట్​తో పనిచేస్తుందని చెబుతున్నారు. మాలి–జీ51 ఎంపీ3 జీపీయూతో వచ్చే ఈ టీవీకి 3జీబీ ర్యాం ఉంటుందంటున్నారు.