1,413 మంది బాలకార్మికులకు విముక్తి..828  మంది తెలంగాణకు చెందిన పిల్లలే

1,413 మంది బాలకార్మికులకు విముక్తి..828  మంది తెలంగాణకు చెందిన పిల్లలే

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీస్-, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జులై  1 నుంచి 31 వరకు నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్-’లో మొత్తం 1,413 మంది చిన్నారులను కాపాడారు. అడిషనల్ సీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో బాల కార్మికులుగా,  భిక్షాటన చేస్తున్న పిల్లలను రక్షించి పునరావాసం కల్పించడమే లక్ష్యంగా నెల రోజులు డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపట్టారు.  

నగర వ్యాప్తంగా 26 ప్రత్యేక డివిజనల్ బృందాలను ఏర్పాటు చేసి, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ట్రాఫిక్ కూడళ్లు, నిర్మాణ రంగ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.  రక్షించిన పిల్లల్లో తెలంగాణకు చెందినవారు 828 మంది ఉండగా, ఇతర రాష్ట్రాలకు చెందినవారు 563 మంది, నేపాల్​కు చెందినవారు 22 మంది ఉన్నారు. చిన్నారులను చట్టవిరుద్ధంగా పనుల్లో పెట్టుకున్న యజమానులపై 64 ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నమోదు చేశారు. కనీస వేతనాల చట్టం కింద 723 కేసులు నమోదు చేశారు.