
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగాసోమవారం ‘చలో ఇంటర్ బోర్డు’ కార్యక్రమాన్నిచేపట్టాలని అఖిలపక్షం నేతలు నిర్ణయించారు. ఎవరు అడ్డుకున్నా ఇంటర్ బోర్డు ఆఫీస్‌ను ముట్టడించి తీరుతామని స్పష్టం చేశారు. శనివారంసీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కాం గ్రెస్ , టీడీపీ, టీజేఎస్ , సీపీఐ తదితర పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్నగందరగోళంపై చర్చించారు. ఆత్మహత్యలు చేసుకున్న స్టూడెంట్స్ కుటుంబాలను పరామర్శిం చాలని నిర్ణయించారు. అనంతరం కార్యాచరణ ను ప్రకటించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. స్టూడెంట్స్‌కు అండగా ఈ నెల 29న ‘చలో ఇంటర్ బోర్డు’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇంటర్‌లో ఘోరమైన తప్పిదాలు జరిగాయని, అయినా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చున్నదని, ఇదంతా ఒక కంపెనీ ప్రయోజనం కోసమేనని విమర్శించారు. టీఎస్ పీఎస్సీలోనూఅనేక తప్పులు జరిగాయని ఆరోపిం చారు.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇంటర్ వ్యవహారంపై కంటితుడుపు చర్యగా ప్రభుత్వం కమిటీ వేసిందని, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని మండిపడ్డారు . గ్లో బరీనా సంస్థకు కేటీఆరే బాధ్యతలు ఇప్పించారని ఆయన ఆరోపించారు. సమాజంలో చదువుకున్న వారుంటే ప్రశ్నిస్తారన్న భయంతోనే కేసీఆర్ విద్యావ్యవస్థను నిర్వీర్వం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర లో ఇలాంటి ఘోరమైన తప్పిదాలు చూడలేదని, పసిపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, పేరెంట్స్ క్షోభకు గురవుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు స్టూడెంట్స్‌కు మద్దతుగా ఉన్నా యనిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా విద్యాశాఖమంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలకు కేసీఆర్ కొడుకు, కోడలు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో గ్లోబరీనాసంస్థను తిరస్కరిస్తే , ఇప్పుడు ఆ సంస్థకు మళ్లీఎందుకు రిజల్ట్స్ ప్రాసెస్ కు అవకాశమిచ్చారని ప్రశ్నించారు. ఇంటర్ బోర్డులో కార్యదర్శి చాలాకాలం నుంచి పనిచేస్తున్నారని, అక్కడ పదవీకాలం అంటూ ఏమీ లేదా అని నిలదీశారు. చనిపోయిన ఇంటర్ స్టూడెంట్స్ కుటుంబాలు, బాధితులతో సంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు .