26 నుంచి ఓయూ డిగ్రీ పరీక్షలు

26 నుంచి ఓయూ డిగ్రీ పరీక్షలు

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీకాం ఆనర్స్, దూరవిద్య బీకాం, దూరవిద్య బీబీఏ తదితర అన్ని కోర్సుల మొదటి, రెండో, మూడో సంవత్సరం బ్యాక్‌ లాగ్, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 26వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌ సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.