వీఎన్ఆర్ వీజేఐఈటీ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి.. మహిళా కమిషన్కు ఓయూ జేఏసీ లీడర్ల ఫిర్యాదు

వీఎన్ఆర్ వీజేఐఈటీ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి.. మహిళా కమిషన్కు ఓయూ జేఏసీ లీడర్ల ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: వీఎన్ఆర్ వీజేఐఈటీ కాలేజీ గుర్తింపు రద్దు చేసి, చైర్మన్ సురేశ్​బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఓయూ జేఏసీ లీడర్లు ఆర్.ఎన్.శంకర్, గడ్డం శ్యామ్ డిమాండ్ చేశారు. వీఎన్ఆర్ వీజేఐఈటీ కాలేజీ విద్యార్థినిపై అదే కళాశాలలో చదువుతున్న యువకుడు మత్తు చాకెట్లు ఇచ్చి లైంగిక దాడి పాల్పడిన ఘటనపై బుధవారం మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సదరు యువకుడిపై బాధితురాలు కళాశాల ప్రిన్సిపాల్, డీన్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

వారి నిర్లక్ష్యం కారణంగానే 18 నెలలపాటు ఆమె నరకయాతన అనుభవించిందని, చివరకు ఆత్మహత్యాయత్నం చేసిందని పేర్కొన్నారు. కళాశాల చైర్మన్ సురేశ్​బాబు, ప్రిన్సిపాల్ చెన్నకేశవరావు, సీడీ నాయుడుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే కాలేజీ ఎదుట ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.